Saturday, February 20, 2010

విన్నపం


దయరాదా దాసుడిపై ఇకనైనా ఓ మనసా
వినరాదా విన్నపమే ఇపుడైనా ఓ మనసా!
తప్పేదో జరిగుందని నే తలవంచాను కాదా
ఆ నేరాలను మన్నించి నను చేరుకోరాదా!!

వలపన్నది వరమని ఇపుడేగా తెలిసింది
వగపన్నది విషమని ఈ దూరంఏ తెలిపింది
నిను పిలువని పెదవులకే పదములు రాకున్నవి కదా
నిను తలువని కన్నులకే ఊహలు కరువైనవి కదా!!

కన్నీటి సంద్రంలో కనిపించని తీరాలు
నీ గుండెల మంటల్లో నా ఆశల హోమాలు
ఈ మూగ రోదనతో ప్రళయానికి ఆహ్వానం
కనిపించని దేవతకు కడసారిగా నా విన్నపం!!

No comments:

Post a Comment