Saturday, June 26, 2010

కొత్త బంగారులోకం

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా.. నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా... ఆ గాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పదినెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా...అపుడో ఇపుడో కననే కననూ అంటుందా
ప్రతి కుసుమం తనదే తనదే విరిసే కొమ్మైనా... ఏ గుడికో జడకో సాగనంపక వుంటుందా
బ్రతుకంటే బడిచదువా అనుకుంటే అది సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా ..కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా..గతితోచని గమనానికి గమ్యం అంటూ వుందా
వలపేదో వలవేస్తుంది వయసేమో అటు తోస్తుంది.. గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే ఋజువేముంది
సుడిలోపడు ప్రతి నావా చెబుతున్నది వినలేవా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా ..ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా...
మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా...కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెబుతుందా..
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని..
అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక వురికే జతలు...
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాతా అనుకోదేం ఎదురీతా...
పదినెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా...అపుడో ఇపుడో కననే కననూ అంటుందా
ప్రతి కుసుమం తనదే తనదే విరిసే కొమ్మైనా... ఏ గుడికో జడకో సాగనంపక వుంటుందా
బ్రతుకంటే బడిచదువా అనుకుంటే అది సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

గమ్యం

ఎంతవరకు, ఎందుకొరకు, ఇంతపరుగు, అని ఆడక్కు
గమనమే నీ, గమ్యమైతె, బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులువుందే, గుర్తుపట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో వున్నదని చెప్పెదాక ఆనిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతిచొట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా
ఎంతవరకు, ఎందుకొరకు, ఇంతపరుగు, అని ఆడక్కు
గమనమే నీ, గమ్యమైతె, బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులువుందే, గుర్తుపట్టే గుండెనడుగు

కనపడే ఎన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు.
అడగరే ఒక్కొక్క అల పెరూ ఊ ఊ
మనకిలా ఎదురైన ప్రతివారు, మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరు ఊ ఊ
సరిగ చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా వున్నది
చుట్టు అద్దాలలో విధి విధి, రూపాలూ నువ్వు కాదంటున్నది
నీ వూపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా
ప్రపంచం నీలో వున్నదని చెప్పెదాక ఆనిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతిచొట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలే
నీడలు నిజాల సాక్ష్యాలే ఏ ఏ..
శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే ఏ ఏ....
ఎదురైన మందహాసం, నీలోని చెలిమికోసం
మోసం రోషం ద్వేషం నీ మదిలి మదికి భాష్యం
పుట్టాక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం, రంగులు ఏం వేస్తావో కానీ
(తరరరరే తరరరరే తరరరరె తారారరె) - 3

Saturday, June 19, 2010

మళ్ళీ పుట్టనీ నాలో మనిషినీ

ఉప్పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది...మనసును కడగాలనే ఆశ...
కొడిగట్టే దీపంలా మినుకుమినుకుమంటోంది మనిషిగా బ్రతకాలనే ఆశ..
గుండెల్లో ఊపిరై....కళ్ళల్లో జీవమై....ప్రాణంలో ప్రాణమై.... మళ్ళీ పుట్టనీ నాలో మనిషినీ....

ఒక్క క్షణం.. ఒక్క క్షణం.. ఒక్క క్షణం.

నువుముందని...నేముందని...నీకన్నా నేముందని...నాకన్నానువుముందని...
నేముందని..నువుముందని..నేముందని... పరుగెత్తే..పరుగులో...
ఓ నేస్తమా.. ఒక్క క్షణం.. ఒక్క క్షణం.. ఒక్క క్షణం..

ఆశలతీరం

అలలై కమ్మని కలలై... ఆశలతీరం వైపుకి కొట్టుకువచ్చిన
గవ్వలు ఎన్నో.. నురగల నవ్వులు ఎన్నో....
గవ్వలు ఎన్నో.. నురగల నవ్వులు ఎన్నో....
రెక్కలు తొడిగిన ఆశలగువ్వలు.., గుప్పెడు గుండెను మోసుకువెళ్ళే
దిక్కులు ఎన్నో....దొరికే చుక్కలు ఎన్నో..
దిక్కులు ఎన్నో....దొరికే చుక్కలు ఎన్నో..

ఊహవెరిదో ................

ఏ చీకటీ చేరనీ నీ కొత్త బ్రతుకులో...రేపొకటుందనీ తెలుసుకో..
నీ ఒకనాటి మిత్రుని గుర్తుపడతావా....గురుతుపడతావా....
కళ్ళలా...నిజాలా... కనులు చెప్పే కథలు...
మరలా మనుషులా ఉన్న కొనాళ్ళు..
ఏ మన్నులో ... ఏ గాలిని ఊదాలనే ఊహవెరిదో ....... ఊహవెరిదో .......

వేదం

ప్రతి నిమిషం ..ప్రతి నిమిషం ..అడుగేసేముందాలోచిస్తూ.......
ప్రతి నిమిషం ..ప్రతి నిమిషం ..ఆలోచనలకు కళ్ళెంవేస్తూ......
ప్రతి నిమిషం ..ప్రతి నిమిషం ..అడుగేసేముందాలోచిస్తూ.......
ప్రతి నిమిషం ..ప్రతి నిమిషం ..ఆలోచనలకు కళ్ళెంవేస్తూ......
ప్రతి ఉదయం కలకరిగినా..నిజమెదురుగా నిలబడుతున్నా...
మనిషి మనిషిగా జీవిస్తే, మనిషిని మనిషిగా జీవించనిస్తే....
అది వేదం.........వేదం.....