Saturday, May 15, 2010

ఎటువైపు నీ పయనం

కొత్త ఊసుల్ని మదిలో నింపి,
సరికొత్త ఊహల్ని మనసుకి పంపి
కలతలలో కనురెప్పగ మారి
చిరునవ్వు కుసుమాలను బహుమతిగా ఇచ్చి
నా విజయానికి దారే చూపిన
ఓ ప్రియతమా...ఎటువైపు నీ పయనం
నీ ఎడబాటుతో మొదలు నా విరహం....

చేరువైనా..దూరమైనా..

శ్రావణ మేఘాలను చీల్చుకుంటూ
చినుకుల వాన మొదలైనపుడు
గుండె గుడిలో జ్ఞాపకాల దీపాలు
ఆరిపోకుండా వెలుగుతున్నప్పుడు ..

నిశ్శబ్దంగా నన్నిలా చేరుకుంటావు..
వర్తమానపు ఒంపుల మీదుగా
ఏ గతపు లోయల్లోకో జారిపోకుండా
మళ్లీ మళ్లీ నీ మాయలోనే మునకలు వేయించేందుకు..

Monday, May 10, 2010

శ్రీ శ్రీ -- పారిజాతం

పారిజాతం చెట్టు క్రింద నులక మంచం, దానిపైనున్న
నా నీలపు బొంత మీద నక్షత్రాల్లా రాలిన ఆ పువ్వులూ

నిర్వికారమయిన తెల్లని తెరపై సర్వవర్ణాల్తో సరసాంగి వగలూ
సన్నజాజి గుంపుల వైభోగాలూ షెహనాయ్‌లపై షహానా రాగాలూ

సిలికన్‌ చిప్స్‌ లోచిలిపికన్నుల నృత్యాలూ
నల్లని మోనిటర్‌ పై తెల్లని అక్షరాల మల్లెలూ

వితంతువులు వీనులపై వినిపించే తీపిరాగాల వింత సాకీలూ
కాలంతో పరుగిడుతూ గులాబీల గుండెల్తో కౌగిలింతలూ

కాలంతో మారిన మరులూ దాహంతో పెంచిన దారులూ

ఎన్ని రూపాలెత్తినా అన్ని పూలూ ఒకే గుబాళింత
ఒక మనసులో ఎన్నెన్నో వసంతాలు సృష్టించే వింత
ఒక హృదయం క్రొత్త తోడును కనుగొన్నపుడల్లా కలిగే గిలిగింత. -----శ్రీ శ్రీ


Thursday, May 6, 2010

ముద్దంటే......

మనసుకీ మనసుకి మధ్య మౌనపు పలకరింపు ముద్దు..
పెదవికీ పెదవికి మధ్య నిశ్శబ్దపు పరామర్శ ముద్దు..
విరహ జ్వాలలని చల్లార్చే చినుకు స్పర్శ ముద్దు
గుండెల్లో దాగి ఉన్న ప్రేమ బయటకు వచ్చేందుకు మొదటి దారి ముద్దు..!

ఇటువంటి కవితలు ఇంకా కావాలంటే visit http://madhumanasam.blogspot.com/