నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా.. నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా... ఆ గాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పదినెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా...అపుడో ఇపుడో కననే కననూ అంటుందా
ప్రతి కుసుమం తనదే తనదే విరిసే కొమ్మైనా... ఏ గుడికో జడకో సాగనంపక వుంటుందా
బ్రతుకంటే బడిచదువా అనుకుంటే అది సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా ..కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా..గతితోచని గమనానికి గమ్యం అంటూ వుందా
వలపేదో వలవేస్తుంది వయసేమో అటు తోస్తుంది.. గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే ఋజువేముంది
సుడిలోపడు ప్రతి నావా చెబుతున్నది వినలేవా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా ..ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా...
మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా...కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెబుతుందా..
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని..
అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక వురికే జతలు...
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాతా అనుకోదేం ఎదురీతా...
పదినెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా...అపుడో ఇపుడో కననే కననూ అంటుందా
ప్రతి కుసుమం తనదే తనదే విరిసే కొమ్మైనా... ఏ గుడికో జడకో సాగనంపక వుంటుందా
బ్రతుకంటే బడిచదువా అనుకుంటే అది సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
No comments:
Post a Comment